rss
twitter
    Find out what I'm doing, Follow Me :)

Saturday, January 30, 2010

చెవులు.

కోకిల గానం వినిపించేవి
శబ్ధానందం కలిగించేవి
మాటకు మనసుకు మద్యనున్నవి
ప్రపంచ ఘోషకు శ్రోతలవి.

పెదవులు.

చిరునవ్వులను చిందించేవి
తేనె పలుకులను పలికించేవి
శృంగారానికి ముందుండేవి
ముద్దులు ఇచ్చి మురిపించేవి
.
పాలమీగడలా మెత్తనైనవి
పూల మేనులా అందమైనవి
సుధారసముతో తయారైనవి
వర్ణనకందని పెదవులవి.

నేత్రాలు.

నవరసాలను పలికించేవి
సుందర జగతిని చూపించేవి
సౌందర్యానికి ఆనవాళ్లవి
కవుల కవితలో కలువపూలవి.

స్పర్శ.

చిన్నారులకు తల్లి స్పర్శ ఆనందం
పడతులకు పూల స్పర్శ ఆనందం
భావకులకు కవితా స్పర్శ ఆనందం
ప్రేమికులకు ఒకరి స్పర్శ ఒకరికి ఆనందం
.
బాధితులకు ఓదార్పు స్పర్శ ఆనందం
ఎదిగేవారికి ప్రోత్సాహపు స్పర్శ ఆనందం
గెలిచిన వారికి అభినందన స్పర్శ ఆనందం
జీవితం విలువ తెలిస్తే నీ స్పర్శ నీకానందం.

ఏడుపు.......

పుట్టి మనం ఏడుస్తాం
పోయి మనవాళ్లని ఏడిపిస్తాం
పుడుతూ తెచ్చుకున్నదాన్ని
పొతూ ఇచ్చేస్తామన్న మాట
.
నొప్పి కలిగితే ఏడుస్తాం
నవ్వుల పాలైతే ఏడుస్తాం
బాధ దేహానికైనా హృదయానికైనా
ఏడుపే మొదటి ఓదార్పన్న మాట
.
ఎప్పుడు ఏడ్చినా ఎందుకు ఏడ్చినా
కన్నీళ్ళు వస్తాయి…అవి
గుండె బరువు దించడానికి
అందమైన కళ్ళు కడగడానికి అట
.
చుట్టపు చూపుగా వస్తేనే
ఏడుపుకి అందం
చీటికీ మాటికీ వచ్చేస్తే
జీవితం దుర్గంధం
.
కష్టమొచ్చినా నష్టమొచ్చినా
ముందుగా ఏడ్చేస్తాం…కానీ
ఆ ఏడుపునే ఏడిపించగలిగితే
జీవితాంతం నవ్వేస్తాం.

ప్రేమలోకం...........

ఏటి గట్లపై పరుగులు
చేతుల్లో చేతులేస్తూ అడుగులు
పూలతోటల్లో ఆటలు
కోకిలతో పోటీ పడుతూ పాటలు
.
ఎంత చెప్పినా తరగని ఊసులు
ఆగమన్నా ఆగని నవ్వులు
ప్రపంచంతో పనిలేని చూపులు
పెదాలపై నాట్యం చేసే ముద్దులు
.
బుంగమూతి అలకలు
అలక తీర్చే కౌగిలింతలు
సయ్యాటల్లో చిలిపి విసుర్లు
వెన్నెట్లో తీపి కబుర్లు
.
ఎడబాటంటే వేదన
ప్రతీ అణువుపై ఆరాధన
ప్రేమవాయువే జీవన శ్వాస
కాలం ఇలా ఆగిపోవాలన్నదే ఆశ
.
రోజులు క్షణాలయ్యే లోకం
స్పర్శ ఆనందమయ్యే లోకం
మనసుకు మనసు తోడుండే లోకం
మాటలకందని ప్రేమలోకం.

అమ్మ చెప్పింది........

ఇంద్రధనసులో రంగులవోలె
పూలగుత్తిలో పువ్వులవోలె
మనిషి మనిషితో కలిసుండాలని
మనసు మనసుతో మాట్లాడాలని
అమ్మ చెప్పింది ముగ్ధహాసముతొ
.
ఈర్షా ద్వేషం వదిలెయ్యాలని
లౌక్యం సౌఖ్యం గుర్తెరగాలని
ఎదగాలంటే ఒదిగుండాలని
నీపై నీకు ప్రేముండాలని
అమ్మ చెప్పింది తీయని స్వరముతొ
.
పెద్దలయందు భక్తుండాలని
సంపాదించే శక్తుండాలని
తొలకరి చినుకులా ముందుండాలని
మంచికి ఎపుడూ తోడుండాలని
అమ్మ చెప్పింది కాంతుల కనులతొ
.
గుండెలొ ఎపుడూ బలముండాలని
పెదవులపైన నవ్వుండాలని
గమ్యపు దారిపై చూపుండాలని
సూర్యబింబమై వెలుగొందాలని
అమ్మ చెప్పింది దీవెనల మాటలతొ

స్వప్న జగతి.

ఎగురుతున్నాను
….కాలాన్ని రెక్కలుగా చేసుకొని
నవ్వుతున్నాను
ప్రేమ కరుణ పెదవులుగా మార్చుకొని
ఆడుతున్నాను
మేఘాల మీదనెక్కుతూ జారుతూ
పాడుతున్నాను
నీటి హోరుతో చిరుగాలి సవ్వడితొ
పలకరిస్తున్నాను
పువ్వు పువ్వుని పేరు పేరునా
పులకరిస్తున్నాను
జాబిలితో పరుగులిడుతూ హరివిల్లుకి ముద్దులిడుతూ
విశ్రమిస్తున్నాను
మబ్బుల పరుపుపై ఆనందపు నిట్టూర్పు విడుస్తూ.

ఆట-ఓటమి-గెలుపు....

 ఆట-ఓటమి-గెలుపు.
. జీవితాన్ని మించిన క్రీడ …మనసుని మించిన క్రీడాస్థలం ……ప్రపంచాన్ని మించిన ప్రత్యర్ధి లేవు . ఓటమంటే నలుగురిలో ఒకడిగా నిట్టూరుస్తూ బ్రతికెయ్యడం ………గెలుపంటే అనుక్షణం ఆనందించెయ్యడం .

మత్తు.........

మత్తు.
కళ్ళుమూసుకున్నంతనె మత్తుకాదుకళ్ళుతెరచి చూచేది సత్తుకాదు      ||కళ్ళు||మనసు పొరల దాగిందిమనసు పొరల దాగింది కలల వలల చిక్కిందిఉందిలేదు తెలిసొచ్చే గమ్మత్తుల మత్తు ఇది ||కళ్ళు||ఉన్నదంత ఒకటనుకుంటే, నీకు నాకు తేడా ఏందిఉన్నదేది లేదనుకుంటే కళ్ళముందు ఇషయం ఏందిచూసేదేలేకుంటే చూపుకు అసలు ఉనికేదిచూపన్నది లేకుంటే ఎవరంటా చూసిందినీకు నిన్ను చూపించే మాయదారి మత్తు ఇది

మగువా!

మగువా!
హేమంతపు ఉదయాన రాములోరి గుడిలో తొలిగంట మోగిన సమయాన చలి గిలిగింతలు పెడుతుంటే వాకిట్లో కళ్ళాపి చల్లి ఇంధ్రధనస్సులో రంగుల్ని పోగేసి ముత్యాల ముగ్గేసి తలార చన్నీళ్ళ స్నానమాడి పట్టు పావడ కట్టి నడిచివస్తున్న ఓ పల్లెటూరిమగువా నీ అందాన్ని వర్ణించ నాకు సాధ్యమా!

చితి మంటల వెలుగులు

చితి మంటల వెలుగులు.......
తొలి సంద్య వేళ నిన్ను చూస్తాననే ఆశ మలి సంద్య వేళ అప్పుడే రోజు గడిచింది అని నిరాశ ఆశ నిరాశ ల నడుమ నా జీవితం చీకటి మయం అయ్యింది నా చితి మంటల వెలుగులైనా ఈ చీకట్లను పారదోలగలవా.

ష్ ......

ష్ ......
గంట నుంచీ నాతో మాట్లాడుతున్నావు ఫోన్లో ఏదో ! ఒక్క క్షణం నిశ్శబ్దం - అప్పుడర్థమైంది ...నువ్వు చెప్పదలచు కున్నదేమిటో !

ప్రేమ............

ఎండ వేడిమికి చల్లదనాలు ....
చలి తాకిడికి స్వేదములు ....

కంటికి ఎవ్వరు కనబడరు ....
ఎవ్వరి మాటలు వినబడవు ....

కనిపించును ఒకే రూపం ....
వినిపించును ఒకే స్వరం ....

పెద్దలు రారు కానకు ....
ప్రాణములు లేదు లెక్కకు ....

తనువు చలించదు ఎ తాకిడికి....
చలిస్తుంది ఆమె స్పర్శకు .....

ఇదే రెండక్షరాల లోకం .....
ప్రేమ అనునది దిని నామం ......................................................


ఇట్లు మీ శ్రేయోభిలాషి,...................... 

తెలుగు భాషలో అమ్మ అనే పదం కన్నా విలువ అయినది మరొకటిలేదు.............

తెలుగు భాషలో అమ్మ అనే పదం కన్నా విలువ అయినది మరొకటిలేదుకాబట్టి.

మనసు కి గాయం అయితే మనసు పలికే చిన్న మాటే "అమ్మ".
శరీరాని కి గాయం అయితే పెదవుల వెంట వచ్చే రెండు అక్షరాల పలుకే "అమ్మా".

అమ్మ గురించి ఒక కవి ఏమన్నాడో తెలుసా ?కొలిస్తే నే పలికేది ఆ దేవుడు...కాని పిలవకుండానే పలికేది "అమ్మ మనసు" మాత్రమే..

ఒక విషయం గురించి మాట్లాడమంటే 1 గంట/రోజు/నెల మట్లాడవచ్చు. కాని అమ్మ గురించి మాట్లాడమంటే జీవితాంతం మాట్లాడుతూ నే ఉండవచ్చు....అదే "అమ్మ ప్రేమ".

"ప్రాణం" అనే పదం చాలా చిన్నది "అమ్మ" అనే మాట ముందు కాదు అనగలరా ఎవరైనా?

ఈ లోకం లో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంటే అది కేవలం అమ్మ మాత్రమే.

అమ్మ ని ప్రేమించే ప్రతి ఒక్కరి కి స్వాగతం...సుస్వాగతం...అమ్మ గురించి మట్లాడండి ఆ మాట కు ఉన్న విలువ ని మారింత పెంచండి...

ఒక్క మాట::అమ్మ గురించి నీకు తెలియదని కాదు నాకు తెలిసింది చెప్పాను.........................................................

ఇట్లు మీ శ్రేయోభిలాషి,......................

మనసు లోని భావాలెన్నో..........

మనసు లోని భావాలెన్నో..
మరువలేని గేయాలెన్నో..
వీడలేని నెస్తాలెన్నో..
వీడిపోనీ బంధాలెన్నో..
మరపురాని పాటలెన్నో..
మాధురమైన క్షణాలెన్నో..
కవ్వించే కబుర్లెన్నో..
మాయమయ్యే మార్పులేన్నో ..
అవసరానికి వాడిన అబ్బద్దాలేన్నో..
తుంటరిగా చేసిన చిలిపి పనులెన్నో..
ఆశ్చర్యపరిచే అద్భుతాలెనో..
మాటల్లో చేపలేని మచ్చుతునక లెన్నో..
ముసుగువేసిన మనస్సుకు మరువరాని జ్ఞాపకలేన్నో..
ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో............
మనిషి జీవితం లో మరువలేనివి మరెన్నో... ......... ...
ఇదేలే జీవితం దీన్ని అనుభవించు అనుక్షణం.. .................

ఇట్లు మీ శ్రేయోభిలాషి,......................

పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం ‘అమ్మా’.......

పదాలు తెలియని పెదవులకు
అమృత వాక్యం ‘అమ్మా’
ఆమె చల్లని ఒడిలో మొదలైంది ‘ఈ జన్మ’

పసిపాప బోసి నవ్వుల కోసం
తల్లి అయినది ఓ నేస్తం
పంచ ప్రణలు పాపయి కొసం
పంచి ఇచ్చింది ,తన రక్తం

బుజ్జీ బుజ్జీ పాపయికి బుజ్జగింపునకు జోలపడింది
కోటి ఆశల చిన్న పాపయికి జన్మ నిచ్చింది
చందమామనే మేనమామగా చేసింది
జాబిలినే భువికి రమ్మంది
కమ్మాని కదలెన్నో చెప్పింది
ఆది గురువై అక్షరం నేర్పింది
ఈ జీవితంలో నా ప్రియ నేస్తం’అమ్మ’
ఆమె లేకుండ ఉండేదా’ఈ జన్మ’
అందులకే తల్లి ఋణం తీర్చలేం
ఆమెకు ఈ జన్మ అంకితం
సదా కన్న తల్లి దేవత

ఈ జీవితానికి ఆమె ఒక విదాత...

 ఇట్లు మీ శ్రేయోభిలాషి,......................

చీకటిలో ఉన్నానని చింత పడకు....

చీకటిలో ఉన్నానని చింత పడకు
దాన్ని చీల్చుకొని వచ్చే వెలుగు కోసం ఎదురుచూడు
ఓటమి పొందానని కలత చెందకు
ఓటమినే ఓడించి గెలిచే మార్గాన్ని వెతుకు
నమ్మకం నీ చేతిలో ఒక ఆయుధం
ఆ నమ్మకముతో ముందుకు వెళ్ళు
విజయం అన్ని వేళల నీ చెంతనే ఉంటుంది
All the best my FRIEND....................

స్నేహం..........

నే నడిచిన బాటలో విరిసిన కుసుమం నీ స్నేహం...
నే వదిలిన శ్వాసలోని భావం నీ స్నేహం...
నా అడుగుల శబ్దం నీ స్నేహం....
జడి వాన లో తడిస్తే కలిగే పులకరింపు నీ స్నేహం....
నా అందం నీ స్నేహం...
నే దేవుడిని కోరే ఒకే కోరిక నీ స్నేహం....
మన స్నేహం కలకాలం కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.....
మీ,
 ఇట్లు  మీ శ్రేయోభిలాషి  ................................