rss
twitter
    Find out what I'm doing, Follow Me :)

Thursday, February 25, 2010

అనుభవాల ఆలాపన............

జీవితం ఒక అనుభవాల మూట

ఎప్పటికప్పుడు దాన్ని కట్టిపడేస్తూ ఉంటే

గుట్టు చప్పుడు కాకుండా ఊంటుంది…॥

మూట ముడి విప్పావంటే…

ఆనుభవాలు సాంతం నిన్ను చుట్టుముట్టేస్తాయి...

విన్నపం........

జీవితంతో రోజూ ఘర్షణే జీవించనిమ్మని....
దేవుడితో ప్రతి నిమిషం ప్రార్థనే మనిషిగా ఎదగనిమ్మని !
శిశువు నుండి పట్టుదల
కొండ నుండి నిండుదనం
నేల నుండి సహనం
చెట్టు నుండి త్యాగం
నేర్చుకోవచ్చని తెలిసిన క్షణం నుండి
చేస్తున్న ఈ సమరం..................
నా ఆఖరి శ్వాస వదిలే వరకునన్ను ఎలాగే ఎదగనిమ్మని ఆ దేవుడికో విన్నపం.........

మళ్ళిరాని అవకాశం........

కోల్పోవద్దు మరో అవకాశం
రాకపోవచ్చు తిరిగి నీ కోసం॥
మనసు విప్పి మాట్లాడడానికి,
ఒక మంచి మాటను చెప్పడానికీ,
ప్రేమిస్తున్నానని తెలుపుతూ,
ఒక సందేశం పంపించడానికీ॥ …। కోల్పోవద్దు మరో అవకాశం …।
ఎంతో దూరాన వున్న,
అమ్మానాన్నల కోసం,
వారం, వారం ఫోనులో,
వార్తలు తెలిపే లేఖలో॥ …। కోల్పోవద్దు మరో అవకాశం …।
అందరికీ రానిది ఆ,
అవకాశం వచ్చిందా
అదే ఒక అదృష్టం,
కర్తవ్యం నెరవేర్చే,
స్థితిలో నువ్వుంటే,
నీకు దేవుడు ఇచ్చిన పుణ్యం॥ …। కోల్పోవద్దు మరో అవకాశం …।
మనసారా స్పందిస్తూ,
మమతలనే అందిస్తూ,
ఓ “థేంక్‌ యూ”, ఒక “సారీ”,
“ఐ లవ్‌ యూ” చెప్పేందుకు॥ …। కోల్పోవద్దు మరో అవకాశం
వచ్చిన దానిని వదిలీ,
ఎదురుచూడకు మరో సారి,
అతి విలువైన క్షణాల మధ్య,
ఉండొచ్చు కొన్ని జీవిత కాలాల వ్యవధి॥ …। కోల్పోవద్దు మరో అవకాశం …।
ఆలసించబోకుమసలు,
ఆచరణను మరచీ,
కలగా కరిగే బ్రతుకున,
కావచ్చునిదే (నీ) ఆఖరి మజిలీ॥ …। కోల్పోవద్దు మరో అవకాశం …।