rss
twitter
    Find out what I'm doing, Follow Me :)

Saturday, March 13, 2010

నేనూ సైనికుడినే.........

విజ్గ్నానం వేటలో
సౌకర్యాల దాహంలో
ధనసముపార్జనా సమ్మొహనంలో
దూరతీరాలను చేరి
ఉభయసంధ్యల మధ్య
పరుగుపందెంగా మారి
సరిహద్దు గస్తీ సైనికుడి నిరంతర కవాతులా
విరామమెరుగని జీవితం అలసిన క్షణాన
భవిష్యత్తు ప్రణాళికకై నేను ఒక సైనికుడిలా శ్రమిస్తున్నాను......

అలసిపోతున్నాను.....

కాల భూతం యంత్ర దంతాలలో చిక్కిన
అనుభూతుల అవశేషాలను పోల్చుకోలేక!
కాల వర్తన పద ఘట్టనలో చిట్లిన
అందమైన అవకాశాలను అందుకోలేక!!
నిద్రలేని సాంత్వనలో ఛిద్రమైన స్వప్నాలను
అతికించి తిలకించి పులకించి అలిసాను...........
వర్తమానం పైన బెంగ లేదు,ఆశ అనేది ఉంటేగా!!!!
గతం వల్ల బాధ లేదు,గుర్తుండాలిగా ముందు!!!
భయమంతా భవిష్యత్తు గురించే? ఎదురవుతుందా అసలు అని?!!!!
మరింకా చేసేదేముంది,వర్తమానం గతం అవుతుందని
భవిష్యత్తు ఇప్పుడే వస్తుందని, వేచి ఉండడం తప్ప????????