rss
twitter
    Find out what I'm doing, Follow Me :)

Wednesday, August 4, 2010

రేపటి ఉదయం...........

ఆలోచనలతో ఎన్ని ఋతువులు కరిగిపొయాయో ....
నా కన్నీళ్లల్లో ఎన్ని కలలు జారిపొయాయో....

మనసు మెదడుతో చేసే యుద్దం....
ఫలితమే ఎన్నో నిదురలేని రాత్రులు....

అయితేనేమిలే........
పారిపోయిన కాలాన్ని పట్టుకోలేమని తెలుసుకున్నాను.

ఓ నిరాశా....
ఈ రాత్రి మాత్రమే నీది....
రేపటి ఉదయం ...నాది...

నా కలలు..........

నిండు వెన్నెలలో ఎగసిపడే సముద్ర కెరటంలా....ఉంది
ఈ రోజు నా మనస్సు.....

నీటిలోని బుడగలా నా ఆలోచనలు....
తీరం చెరినట్టే చేరి....
పట్టుకునే లోపే మాయమవుతున్నాయి....

అలల ఆటకు అలుపులేదు....
నా కలల బాటకు గమ్యం లేదు.

ఈ తరం..........

అలారం మోతలతో
ఉలికిపాటు మెలకువలు
అలసిన మనసులతో
కలలు లేని కలత నిదురలు

పోగొట్టుకుంటున్నది పోల్చుకొలేని
పొందుతున్నది పోల్చుకొలేని
భారమైన బిజి జీవితాలు
త్రుప్తి తెలియని చింతా చిత్తాలు

పగలంతా క్షణాలకు విలువకట్టుకుంటూ
రాత్రాంతా ఆనందాలకు అర్ధాలు వెతుక్కుంటూ.....
ఇక ఇంతేనా ఈ తరాలు....
మార్పు తెచ్చేనా భావితరాలు......

ఆశ............

ఇష్టంతో కష్టపడి, కష్టాన్నే ఇష్టపడి
కష్టపడి ఇష్టపడి, ఆశయానికి కట్టుబడి కన్నీటిని బంధించి
భాధల్ని గర్జించి,రేపటి ఉదయం కొసం వేచిచూడు....
నేడు ఎవ్వరిదైనా , రేపు మనది...

కవితా రూపం....

పద్యమో పదమో,భావమో అభావమో
అనుభూతో అనుభవమో....
కవితా రూపం....

కొంత అందం, ఇసుమంతైనా అర్థం...
మరింత కాకపోయినా అలంకారం
అంతో ఇంతో చమత్కారం....
ఈమాత్రం చాలవా రాయాలంటే ఒక కవితా రూపం....

నిరీక్షణ

ఆకాశం ఏనాటిదో, అనురాగం ఆనాటిది...
ఆవేశం ఏనాడు కలిగెనో, ఆనాడే తెలిసిందది.....
ఏ మేఘం ఏ వాన చినుకై....
చిగురాకై మొలకెత్తెనో.....
ఏ రాగం ఏ గుండె లోతున, ఏ గీతం పలికించునో...
ఆనాడైనా నా నిరీక్షణ ఫలించునా????