rss
twitter
    Find out what I'm doing, Follow Me :)

Saturday, February 13, 2010

నడక............

నిరాశావాదిని కానునిజాన్ని నిజాయితీగా అలోచిస్తాను..తెలియకుండా జరిగేది పుట్టుకఎప్పుడు వస్తుందో తెలియనిది చావుచావు పుట్టుకుల మద్య వంతెన జీవితంనిలపలేని నడక సమయంగడిచే ప్రతి క్షణం గమ్యం వైపేఅనుభవిస్తూ ఆనందిస్తూ సాగిపోవడమే!

బ్రతుకు..........

పరిగెత్తే కాలం
పట్టుకోను పరుగులెట్టే  మనం
క్షణం తీరికలేని జీవితం
తియ్యటి కబుర్లకి
చిలిపి అలకలకు
విరబూసిన  నవ్వులకి
మొహం వాచివున్నాం
తినే తిండి బ్రతకడానికి
పీల్చే గాలీ బ్రతకడానికే
దీనికి అంతమేపుడో?
ఈ పరుగులు   ఇక చాలని
బ్రతుకు అనుబవిస్తూ ఆనందిస్తూ
ఇక ఈ క్షణం నాది అని అనుభవించేదేప్పుడో?

జ్ఞాపకం............

పరి పరి విధాల పోతుంది మనసు
నీ ఓర చూపు సోయగం
నీ వాలు జడ వయ్యారం
నీ పెదవి విరుపు కర్కశం
నీ కొనదేలిన ముక్కు పొగరు
నీ చల్లని వెన్నెల నవ్వు
నిను చూడని ప్రతి క్షణం జ్ఞాపకమై
నన్ను ఒకచోట నిలవనీక
నన్ను నేను గా ఉండనీక
నీ జ్ఞాపకం నన్ను పరిపరి విధాల…:(

ప్రేమ.............

స్నేహంతో మొదలవుతుందంటారు
తొలి చూపు మలి చూపు ప్రేమ ఎప్పుడు మరి?
చావు లేనిదంటారు, అనగా విన్నాను నిజం తెలియదు
అసలు ప్రేమ అంటే ఏమిటి?
ఒక అవసరం ఏమో కదా?
నీకు నేను నాకు నువ్వు అనుకోవడమేనా?
ప్రేమ ఒక అవసరం అయినపుడు
అంత కష్టమా దానిని పొందటం?

నాయకుడు............

పదునైన మాటలు కూర్చి పేర్చి
ఆవేశం అభినయం చేర్చి
జనాన్ని ఒప్పించి మెప్పించి
నిజం నిజాయితేనే మార్గమని
చేత ఉన్న ఓటే భవిష్యత్తు బాటని
ఆలోచించమని అలోచించి వాడమని
ఉత్తేజ పరచి ఉర్రుతలూగించి
కధం తొక్కుతూ తనకు తనే సాటని
జనం లోని వాడే జనం తోనే అని
జనం మంచే తన మంచి అన్నుకున్నవాడే నాయకుడు.

రైతన్న...................

చినుకు కోసం పడిగాపులు పడి చినుకుకు చేమటధార  చేర్చి మట్టిని బంగారం చేసి ఆ బంగారాన్ని అయినకాడికమ్మి  తన ఖర్మ ఇంతేననుకుంటూ మళ్ళా చినుకుకోసం పడిగాపులు పడేవాడే  రైతు.

వయసు........

"నా యవ్వనం సెలవుతీసుకున్నది మరి తిరిగిరానంటు రంగు మారుతున్నతల జరుగుతున్నదేమిటో చెబుతున్నది "నాన్నా" అన్న పిలుపు పులకరింతగా నా నిన్నటిని గుర్తుకుతెస్తూ.. నేను చెయ్యని అల్లరిని చూడాలని నాలో ఆరాటం కలిగిస్తుంది "

యుద్ధం.........

దుఃఖం అహంకారంతో యుధం చేస్తుంది
కన్నీరై బయటపడి జారిపోదామని
అహంకారం సంధికి సిద్ధపడి చీకటికై ఆగమంటుంది
దుఃఖం సమయం కోసం ఆగలేనంటు యుద్ధం సాగిస్తుంది
చూడాలి ఎంతకాలమో ఎవరిదో గెలుపు.