rss
twitter
    Find out what I'm doing, Follow Me :)

Saturday, July 3, 2010

వయసు....................

"నా యవ్వనం సెలవుతీసుకున్నది మరి తిరిగిరానంటు
రంగు మారుతున్నతల జరుగుతున్నదేమిటో చెబుతున్నది
"నాన్నా" అన్న పిలుపు పులకరింతగా నా నిన్నటిని గుర్తుకుతెస్తూ..
నేను చెయ్యని అల్లరిని చూడాలని నాలో ఆరాటం కలిగిస్తుంది "

యుద్ధం .......................

దుఃఖం అహంకారంతో యుధం చేస్తుంది కన్నీరై బయటపడి జారిపోదామని అహంకారం సంధికి సిద్ధపడి చీకటికై ఆగమంటుంది దుఃఖం సమయం కోసం ఆగలేనంటు యుద్ధం సాగిస్తుంది చూడాలి ఎంతకాలమో ఎవరిదో గెలుపు

కనిపించడం లేదు...............

నా మనసు కనిపించడం లేదు
నువ్వేమైన పట్టుకేల్లవా?
మమకారంతో రాసుకున్న నా కవితలున్నాయి..
కొమ్మ కొమ్మ కు రాసుకున్న జ్ఞాపకాలున్నాయి
సముద్రపు అలలూ చేసే సవ్వడులు ఇంకా నాకు గుర్తున్నాయి
ఆ భావాత్మక క్షణాలు ఇంకా జ్ఞాపకమే
రంగుల మధ్య రూపు దిద్దుకున్న నా జీవితం జ్ఞాపకమే
మనసు పడికొనుక్కున్న శ్రీశ్రీ రచనలు ఇంకా నాకు గుర్తున్నాయి
విప్లవాలు రగిల్చి ఉద్యమాలు తెచ్చిన పుస్తకాలున్నాయి
పుస్తకాల కోసం పడ్డ ఆ క్షణాలు ఇంకా జ్ఞాపకమే
ఇల్లంతా పరచుకున్న కవిత్వముంది
కవిత్వం మధ్య కదలాడే నా జీవితం ఉంది...
ఆశ్రద్దగా పడేసుకున్న నా గెలుపు భావ చిత్రాలున్నాయి...
అస్తమించే సూర్యుడితో పాటు , ఎరుపెక్కే సాయం కాలం మధ్య
చెప్పుకున్న ఎన్నో కథలు గుర్తున్నాయి .....
అన్ని అలాగే ఉన్నాయి...కాని
నా మనసు మాత్రం లేదు...
మిత్రమా , నీమీదే అనుమానం గా ఉంది...
ఈ మధ్య నువ్వోచావు కదా..
నా మనసేమైనా పట్టుకేల్లవా ???

నా పేరు స్నేహం!!

పరుగెత్తే లాంటి కాలంతో నువ్వూ పోటీ పడుతూ
ఒక కొత్త ఆలోచనతో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినపుడు
నువ్వు మర్చిపోయిన చిన్ని జ్ఞాపకాన్ని భద్రంగా
దాచి ఉంచుకుని నీకందించడానికి నీ వెనుకే నేనుంటాను..
నిలకడ లేని కాలం నీ మనసుకి చేసే గాయాల
బాధ నీ కళ్ళలో కనిపించినపుడు
బాధను పంచుకొనే నీ బాధకు ఓదార్పు నేనవుతాను !!!
నిన్ను నువ్వు వెతుక్కొనే ప్రయత్నంలో
నేలోనికి నువ్వు నడిచి వెళ్లి పోయి ...
దారి మసకబారినపుడు ఆసరాగా చేయందించి నిన్ను
ముదుకు నడిపించడానికి నీతో నేనుంటాను....
నీ జీవితంలో ప్రతి విజయానికి
నీ వాళ్ళంతా గర్వించి నప్పుడు కాస్తంత విచ్చుకొనే నీ
పెదవుల నుండి రాలిపడే పూవులోని తావి నేనవుతాను....

ప్రయాణం

ఈ ప్రయాణం నేను కోరుకున్నదే నేమో
ఈ విమానం నేను ఎక్కాలనుకున్నదే కాబోలు
ఈ సహప్రయానికులు మాత్రం నేను తెచ్చుకున్న వారు కారు
ఇది వేల్లెచోటు నేను అడిగిందే అనుకుంటాను...
ఇది కదిలే దారి నాకు నచ్చేదేనని ఆశిస్తాను
ఇది బయల్దేరిన స్థలం మాత్రం నేను మెచ్చినది కాదు
ఇక్కడంతా చీకటి
ఇక్కడంతా ఇరుకు
ఇక్కడ చిన్న కునుకుకు కూడా అవకాశం లేదు
ఇక్కడంతా హడావుడి...
ఇక్కడంతా కదలిక తెలియని వేగం
ఇక్కడ మనసు విప్పి మాట్లాడడానికి ఎవరు లేరు
నాకు నేను ఉహలోకాన్ని అల్లుకుంటాను
నాకు నేను బెత్తెడు జాగా చెక్కుకుంటాను
నాకు నేను దగ్గర కావడానికి ప్రయత్నిస్తాను...