rss
twitter
    Find out what I'm doing, Follow Me :)

Thursday, April 29, 2010

నీవు లేక...............

నీవు లేక...నిదుర లేక....
మనసు లేక...మమత లేక....
ఎంతకాలమో ఈ జీవనయానం....

కదల లేక....మెదల లేక.....
ఎందుకోసమో ఈ జీవన రాగం....
దినమొక యుగముగా, తనువొక సగముగాఎన్నాళ్ళో ఈ అంధకారం...
ఎప్పుడో ఎక్కడో సుప్రభాతం।

నిన్ను చేరేదెలా ???

నీ చెలిమే ఊపిరిగా బ్రతికేస్తున్నా నేను....
నీ తలపే దీపంలా నడిపిస్తున్నది నన్ను....
ఎంత చేరువ చేరిన సొంతమవ్వని ఓ బంధమా!
ఎంతగా తపించినా అందనంత దూరాన ఉన్న బంధమా.....
ఎంత ఆశ ఉన్నా నిన్ను పిలిచే దారి లేని అందమైన ఆకాశమంత ఓ భావమా.....
నిన్ను చేరేదెలా....ఓ వింత బంధమా॥??? (కోటి ఆశలతో).

నా బాల్యమా.............

చిన్న నాటి ఊసులలో ఎంత హయి ఉంది.....అది
తల్చుకున్న కొద్దీ బాధ రగులుతుంది
కరుణలేని కాలప్రభువు ఇంద్రజాలమిది
అదితెలియని హ్రుదయాల ఆవేదన ఇది...
ఓ చిలిపినవ్వు ప్రాయమా ఏమైపోయావు????
నా బాల్యమా....నీవేమైపోయావు॥

సిరి వెన్నెల కవిత....అహంకారం..................

నేను శాసిస్తాను కవితని....
భావి కోకిల గొంతునొక్కిన , చిక్కి చిక్కిన వసంతానికి నేను వినిపిస్తాను నా పాటని.....
చక్రవాకపు గొంతులోనికి నేను చిలికిస్తాను స్వాతిని....
చక్రవాకం మోహనంగా ఆలపించిన కళ్యాణిలోనేను వినిపిస్తాను వీణని
నేను వివరిస్తాను "నా వాణి "ని.....

రాయబారం!!..................

ఆకాశం అందుకోవాలని సాగర కెరటాల ఆరాటం...
దిగంతాల్లో కలుస్తానంటూ ఓక వాగ్దానం
చందమామ సాక్ష్యంగా మిగిలింది
వెన్నెల వెలుగు దారాలతో రాయబారం......

దృశ్యం మారదేం????

రోజూ చేస్తున్న అదే పని...
అవే ఉదయాలు , అవే సాయంత్రాలు
అవే హృదయాలు , అవే అనుభూతులు
రోజులు గడుస్తున్నాయ్ , ఋతువులు మారుతున్నయ్
కానీ దృశ్యం మారదేం?????
ప్రతి రోజూ ఉరుకులు పరుగులు
వెక్కిరిస్తూ ట్రాఫిక్ జాం.... లు
చావడానికి బ్రతుకుతున్న మనుషులు
బ్రతకడానికి చస్తున్న మనుషులు
క్రొత్త సంవత్సరాలు వస్తున్నాయ్.....
పాత సంవత్సరాలు పొతున్నయ్....
కానీ దృశ్యం మారదేం????
దృశ్యాన్నిమారుస్తుందని "క్రొత్త"ని అహ్వానిస్తే
మరుక్షణం లో "పాతై" పోయి , నన్ను వెక్కిరిస్తోంది!!!!
వెక్కిరింతలోనైనా నాకు అవగతమౌతుందా???
దృశ్యం ఎప్పటికీ మారదని.....
మార్చాల్సింది నా దృష్టిని అని !!!!!!
ఈ ఉగాదైనా నా దృష్టిని మారుస్తుందని.....ఆశిస్తూ.........

ధనార్జన..................

ధనం కోసం
దర్జా కోసం
కన్న వారిని విడిచి
తన వారిని విడిచి
ఆకలి దప్పికలు మరచి
కూటి కోసం కోటి విద్యలన్న
సూత్రం మరచి
ఎవరి కోసం ? ఎవరి కోసం?
ఎందు కోసం? ఎందు కోసం?
ఈ విచిత్ర పోరాటం
అని
అంతరాత్మ ప్రశ్నిస్తూ ఉంటే
కాసు కోసం , పచ్చనోటు వాసన కోసం

అంటూ ఆత్మ పరుగు తీసింది
అంతరాత్మ నివ్వెర పోయింది............

గతచిత్రం.....................

కొన్ని గుర్తుకురావు
కొన్ని మరపుకు రావు
గతాన్ని చీకటి వెలుగుల జల్లెడతో జల్లించి
మనసొక మాయాజలం కల్పిస్తుంది।
నిరుడు రాలిన ఆకులమీద ఏ చిత్రాలు గీసుకున్నదీ ఏ చెట్టు గుర్తుంచుకోదు।
పోయిన పున్నమిరాత్రి ఎగసిన అలల్లోఏయే కోర్కెలు దాచుకున్నదీసముద్రం గుర్తుంచుకోదు।
కాని, మనిషిని మాత్రం ఒక జ్ఞాపకంతుదకంటా వెంటాడుతుంది।
పొరలు పొరలుగా రాల్చిన గత రూపాల్ని అరల్లో దాచిమరల మరల కళ్ళెదుట చూపెడుతుంది।
కలిసి కనుమరుగైన మనుషులు,అంది చేజారిన అవకాశాలు,అపరిపక్వతతో, అమాయకతతోపొంది,
పోగొట్టుకొన్న విలువైన అనుభవాలుకిక్కిరిసిన పలు శకలాలుగా తోచి గతం మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తుంది।
ఏమీ తెలియని భవిష్యత్తులోనే కాదు,అంతా ముగిసిన గతం లో కూడావింతైన మార్మికత యేదో నిండిఉంటుంది.